* దీన్ని చూడాలంటే న్యూయార్క్‌లోని క్వీన్స్ జంతు ప్రదర్శనశాలకు వెళ్లాల్సిందే.
* పుట్టినప్పుడు కేవలం అరకిలో బరువు మాత్రమే ఉంది. మామూలుగా అయితే పుడూ జాతి జింకలు 13 నుంచి 17 అంగుళాల ఎత్తు, 33 అంగుళాల వరకు పొడవుంటాయిట. కానీ ఇది అలా కాదు. పూర్తిగా పెరిగినా 23 అంగుళాల పొడవు, తొమ్మిది కిలోల బరువుకు మించదు.
* ఈ జాతి జింకలు ఎక్కువగా ఉండేది చిలీ, అర్జెంటీనా అడవుల్లోనే. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, వేటాడటం వంటి చర్యల వల్ల ప్రస్తుతం అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. అందుకే చిలీలో వీటి సంఖ్యను పెంచడానికి రక్షణ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే క్వీన్స్ జూలో వీటికి అనువైన పరిస్థితుల్ని ఏర్పాటు చేశారు. పైగా జూలో పుట్టిన మొదటి పుడూ జింక పిల్ల కూడా ఇదే తెలుసా?
* ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య సుమారు పది వేలలోపే!
* దీన్ని స్థానిక భాషలో 'మాపుడుంగన్' అని పిలుస్తారు. అలా ఈ జింకకు పుడూ అనే పేరొచ్చింది.
* ఇవి ఆకులు, కొమ్మలు, గడ్డి, క్యారెట్లు వంటి తింటూ బతికేస్తాయి.
* శత్రువులు కనిపించగానే చిందరవందరగా పరుగులు తీస్తూ క్షణాల్లో మాయమవుతాయిట.
* ముదురు ఎరుపు, గోధుమ రంగులో ఒత్తయిన బొచ్చుతో ఉండే వీటిల్లో రెండు ఉపజాతులుంటాయి.
* మామూలు జింకల కన్నా కాస్త భిన్నంగా వీటి తలపై రెండు కొమ్ముల్లాంటి భాగాలు ఉంటాయి. ఈ కొమ్ములు ఏడాదికోసారి ఊడిపోతూ మళ్లీ కొత్తగా వస్తుంటాయి. వీటికో బుల్లి తోక కూడా ఉంటుంది.
* పరిసరాల్ని పసిగట్టే చురుకుతనం ఎక్కువ. అంతేకాదు వేగంగా పరుగెత్తడం, చెట్లెక్కడం లాంటివి చేస్తుంటాయి.
- ============================
No comments:
Post a Comment
Thanks for your comment !