Tuesday, September 23, 2014

Mantis shrimp - మాంటీస్‌ ష్రింపు

  •  


  •  
కళ్లతో ఏం చేస్తాం? పరిసరాల్ని చూస్తాం...    కానీ ఓ జీవి మాత్రం కళ్లతోనే తనపై ఏ చూపు పడకుండా చేస్తుంది. కళ్లతో చూడ్డం తెలుసు. కానీ కళ్లతోనే కనిపించకుండా మాయమవ్వడం తెలుసా? వింటేనే విచిత్రంగా ఉన్నా రొయ్య జాతికి చెందిన మాంటీస్‌ ష్రింపు ఆ పనే చేస్తుంది. కళ్లతో కాంతులు వెదజల్లుతూ తనని తాను రక్షించుకుంటుంది. శత్రువుల చూపు తనమీద పడకుండా మాయ చేస్తుంది.
* ఆసక్తికరమైన ఈ సంగతులన్నీ శాస్త్రవేత్తలు వాటిపై చేసిన పరిశోధనలో బయటపడ్డాయి.

* మామూలుగా అయితే ఈ మాంటీస్‌ ష్రింపులు చురకత్తిలాంటి చూపులతో మనం చూడలేని రంగుల్ని కూడా పసిగట్టేస్తాయి. వీటిల్లో పెద్దవి శత్రువులపై దాడి చేసి, లేదంటే ముందే వాటి ఉనికిని గుర్తించి తప్పించుకుంటాయి. మరి ఇవి లార్వా దశలో ఉన్నప్పుడు బలహీనంగా ఉంటాయి కాబట్టి ఏం చేస్తాయో తెలుసా? కళ్లతోనే మాయ చేస్తాయి. నీటిలో చూడ్డానికి వీలు లేకుండా అదృశ్యం అవుతాయి. పారదర్శకంగా మారిపోతాయి.
* మేరీలాండ్‌ బల్టిమోర్‌ కౌంటీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు వీటి కళ్ల వెనుకున్న కిటుకు గురించి తెలుసుకోవడానికి పరిశోధన మొదలెట్టారు. ఆస్ట్రేలియాలోని లిజర్డ్‌ దీవిలో ఉన్న పరిశోధనశాలలో ఉంచి తెల్లని కాంతి కిరణాల్ని వాటిపై ప్రసరించేలా చేశారు.

* కాంతి కిరణాలు పడగానే మొదట ష్రింపు లార్వాలు వాటి కంటి పైభాగం నుంచి ఆకుపచ్చ కాంతుల్ని, తర్వాత కంటి కింది భాగం నుంచి నీలం రంగు కిరణాల్ని ప్రతిబింబించేలా చేశాయిట. అలా మెరిసే వీటి కళ్లు ప్రసరించే కాంతుల వల్లే అవి పరిసరాల్లో కలిసిపోయినట్టుగా ఉండి ఇతర జీవులకు కనిపించకుండా ఉంటాయన్నమాట.

* ఈ విన్యాసాలు ఫొటోలో బంధించడానికి వీలు పడకుండా ఉంటాయిట.

* ష్రింపులకు చూపు కూడా చాలా ఎక్కువే. అతినీలలోహిత కిరణాల్ని సైతం చూడగలవు. బయటకి పొడుచుకుని వచ్చినట్టు ఉండే వీటి కనుగుడ్లు దేనికదే తిరిగేలా ఉంటాయి.

* లార్వాలు ఎదిగాక కళ్లతోనే పరిసరాల్ని కూడా పసిగట్టి శత్రువును గుర్తిస్తాయిట. ఎంత దూరంలో ఉన్న శత్రువునైనా గంటకు 90కిలో మీటర్ల వేగంతో వెళ్లి చటుక్కున చంపేస్తాయి. అందుకే దీన్ని 'థంబ్‌ స్పిట్లర్‌' అంటారు. 

  • ============================ 
 Visit my website : Dr.Seshagirirao.com _

1 comment:

  1. Information in telugu is rare. nice collection but it is very little. Thank you so much

    ReplyDelete

Thanks for your comment !