Tuesday, September 23, 2014

Gaint Sloth-రాకాసి స్లోత్‌

  •  

  • Gaint Sloth-రాకాసి స్లోత్‌
* బద్ధకానికి మారుపేరైన స్లోత్‌లు  కదలడంలో నెమ్మదైనా  వీటి శరీర పరిణామక్రమం చాలా వేగంగా పెరుగుతుందట. స్లోత్‌లది వింతైన రూపం. రోజులో ఎక్కువ భాగం నిద్రలోనే గడుపుతాయి. బద్ధకానికి మారుపేరుగా పిలుస్తారు. అయితే ఈ జీవిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే ఒక కొత్త సంగతి తెలిసింది.

* ఇప్పటి స్లోత్‌లు కుక్కంత సైజు, ఎనిమిది కేజీల బరువుతో ఉంటాయి. కానీ 11వేల ఏళ్ల క్రితం ఏకంగా ఏనుగంత పెద్దగా ఉండేవి. వాటిని చూస్తే ఏ జీవికైనా హడలు పుట్టేదట. స్లోత్‌లు ఒకప్పుడు అంత పెద్దగా ఉండేవనే సంగతి గతంలోనే తెలుసు.

* ఇప్పుడు కొత్తగా బయటపడ్డ విషయమేంటంటే... వీటి శరీర పరిణామక్రమం చాలా వేగంగా పెరిగిందని. ఎంతంటే లక్ష ఏళ్లకోసారి వీటి బరువు 100 కేజీలు పెరిగేదిట. అంటే లక్షలాది ఏళ్ల క్రితం చిన్నగా ఉన్న స్లోత్‌లు క్రమంగా పెద్దగా పెరుగుతూ వచ్చి ఏనుగంత సైజుకు చేరుకున్నాయి.

* అయినా లక్ష ఏళ్లకు వంద కేజీల పెరుగుదల అంటే తక్కువేగా అంటారేమో! క్షీరదాల్లో మరే జీవి బరువు ఇంత వేగంగా పెరగలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

* ఏనుగంత పెద్దగా ఉన్న ఈ స్లోత్‌ జాతి పేరు megatherium, ఇవి ఉత్తర అమెరికా ఖండంలో తిరగాడేవి. వీటిని జెయింట్‌ స్లోత్‌ అంటారు. వీటి గోళ్లే ఒక అడుగు పొడవు ఉండేవి. అంటే కత్తుల్లా కనిపించేవి.

* జెయింట్‌ స్లోత్‌ జాతి 11,000 ఏళ్ల క్రితం వాతావరణ మార్పుల వల్ల పూర్తిగా అంతరించిపోయింది!
మీకు తెలుసా?
* ఇప్పుడున్న స్లోత్‌లలో 6 జాతులు ఉన్నాయి. వాటిలో కొన్ని రెండు వేళ్లవి, మరికొన్ని మూడు వేళ్లవి.
* స్లోత్‌లు ఇప్పుడు దక్షిణ అమెరికా అడవుల్లో మాత్రమే జీవిస్తాయి!
* ఇవి రోజులో 15 నుంచి 20 గంటలు నిద్రిస్తాయి. అదీ చెట్లమీదే!
* వారానికి ఒకసారి మూత్ర విసర్జనకు, జలకాలాటకు చెట్లు దిగి కిందికి వస్తాయంతే! వీటి నడక, చెట్లు ఎక్కడం చాలా నిదానంగా ఉంటుంది. నిముషానికి అయిదారు అడుగుల దూరం నడవగలవు!
* ఆహారం జీర్ణం కావడానికి సుమారు నెల రోజులు పడుతుంది!

  • ============================

 Visit my website : Dr.Seshagirirao.com _

No comments:

Post a Comment

Thanks for your comment !