మనకు కనిపించే తేనెటీగల జాతికి చెందినదే. చిన్ని రెక్కలతో చూడ్డానికి ఏ ప్రత్యేకత లేకున్నా దీని అసలు బలమేంటో ఇన్నాళ్లకి తెలిసింది. ఈ కీటకం ఎంతో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని కూడా ఎగరగలదని తేలింది. ప్రపంచంలోనే ఎక్కువ ఎత్తున్న పర్వతం ఎవరెస్టు మీద వాతావరణ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉంటాయో తెలుసుగా. గాలి చాలా తక్కువగా ఉండి, జీవులకు ప్రాణవాయువు తీసుకోవడం కూడా కష్టతరమౌతుంది. అలాంటి ఎత్తయిన ప్రాంతాల్లో కూడా బంబుల్ బీ చక్కగా ఎగరగలదని తేలిందిప్పుడు.
* ఈ కీటకం భూమి నుంచి 30,000 అడుగుల ఎత్తులో కూడా ఎగురగలదట. కొన్ని పక్షులు మాత్రమే ఆ వాతావరణంలో, అంత ఎత్తులో ఎగరగలవని ఇప్పటి వరకు తెలుసు. హెలికాప్టర్లు కూడా అంత ఎత్తులో ప్రయాణించలేవు. అలాంటిది చిన్న కీటకమైన బంబుల్ బీకు అంత ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉండడం గొప్ప విషయమే కదా!
* అయినా దీని శక్తి గురించి ఎలా తెలిసింది. అంటే చైనాలో కొందరు పరిశోధకులు ఎత్తయిన పర్వత ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ కొన్ని బంబుల్ బీ కీటకాలు తిరగాడ్డం గమనించారు. అంత ఎత్తులో ఆ వాతావరణాన్ని తట్టుకుని ఎలా ఉండగలుగుతున్నాయో తెలుసుకోవడానికి ఓ ప్రయోగం చేశారు.
* ఓ గాజు గదిలో కొన్ని బంబుల్‌బీలను ఉంచారు. చేతి పంపు ద్వారా అందులోని గాలిని నెమ్మదిగా బయటికి లాగుతూ ఒత్తిడిని పెంచారు. పూర్తిగా భూమి నుంచి 9,000 మీటర్ల ఎత్తులో వాతావరణం ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులు కల్పించారు.
* ఆ ప్రతికూల వాతావరణ పరిస్థితిలోకూడా ఇవి రెక్కల్ని కొట్టుకుంటూ విస్తారంగా చాచడం ప్రారంభించాయి. తల, పొట్ట భాగాల వరకు చాచి గాలిని ఉత్పత్తి చేసుకున్నాయి. పరిస్థితుల్ని అనుగుణంగా మార్చున్నాయి. దీని ఆధారంగా ఇవి పైకి వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గుతున్నా ఎలా ఎగురుతున్నాయో తెలుసుకున్నారు.
* అయినా ఇవి ఎలా ఎగిరితే మనకేంటీ అంటారా? వీటిపై పరిశోధనలు జరిపి, వీటి రెక్కల నిర్మాణాన్ని గమనించి, చాలా ఎక్కువ ఎత్తులో ఎగరగలిగే విమానాల్ని తయారు చేస్తారట.
* బంబుల్‌బీలల్లో దాదాపు 250 జాతులున్నాయి.
* దీని పేరుకు అర్థం ఝుంకారం. ఇది చేసే శబ్దం వల్లే ఈ పేరొచ్చింది.
* ఇవి రెక్కల్ని ఫ్యాన్‌లా ఆడిస్తూ వాటి గూడును చల్లబరుచుకుంటాయి!
- ============================
No comments:
Post a Comment
Thanks for your comment !