* శాస్త్రవేత్తలు ఈ మధ్యే నన్ను కనుగొన్నారు. చైనాలో Lanzhou-Minhe పరివాహక ప్రాంతంలో దీని శిలాజాలు దొరికాయి. వాటిని బట్టి కంప్యూటర్లో ఊహా చిత్రం గీస్తే ఇలా దీని ఆకృతి వచ్చింది. అంతేకాదు దీని గురించి ఆసక్తికరమైన విషయాలు కూడా బయట పడ్డాయి.
*ఇవి ఎంత పొడవుండేవంటే ఏకంగా 60 అడుగులు! అంటే సుమారు రెండు బస్సుల పొడవంత. భూమిపై తిరగాడిన జీవుల్లో వీటిదే భారీ ఆకారమని పరిశోధకులు అంటున్నారు.
* కేవలం వీటి భుజం ఎముకలే దాదాపు ఆరున్నర అడుగులు. అంటే మనుషులకన్నా ఎక్కువ పొడవన్నమాట.
* పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధనలో దాని పళ్లు, వెన్నెముక, భుజం ఎముకలు దొరికాయి. వాటిని పూర్తిగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
* దీని శరీర నిర్మాణం 1929లో చైనాలో దొరికిన ఆ జాతి డైనో నిర్మాణానికి దగ్గరగా ఉందని గుర్తించారు.
* దాని రూపమే కాదు పేరు కూడా బారెడుంది. నోరు తిరగడమే కష్టం. Yongjinglong datangi అంటారు. దీనికి చైనాలో డ్రాగన్ అని అర్థం. ఇక ఈ జాతి సారోపాడ్ (sauropod). ఇప్పటి వరకు దొరికిన ఆ జాతి అవశేషాలను, వాటి శిలాజాలతో పరిశీలించి శాస్త్రవేత్తలు వాటి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తున్నారు.
* ఆకారంలో భయంకరంగా ఉన్నా అవి ఎలాంటి హానీ చేయం. పూర్తిగా శాకాహారులం. ఆకులు అలములు తింటూ బతికేవి .
* అవి బతికింది 100 మిలియన్ సంవత్సరాల క్రితం.అంటే దాదాపు పది కోట్ల ఏళ్లన్నమాట. అప్పుడు వాతావరణం ఇప్పుడున్నట్లు కాక భిన్నంగా ఉండేది.
- ============================
No comments:
Post a Comment
Thanks for your comment !