Tuesday, September 23, 2014

Dreadnoughtus schrani Dynosar -డ్రెడ్‌నాటస్ స్రాని డైనోసార్

  •  

  •  Dreadnoughtus schrani Dynosar- డ్రెడ్‌నాటస్ స్రాని డైనోసార్
 

పురాణ కథల్లో భారీ పరిమాణంతో ఉన్న రాక్షసుల గురించి వినే ఉంటారు. నిజంగా అంత పెద్ద డైనోసార్‌ ఒకప్పుడు భూమ్మీద బతికేవి . ఇది ఇప్పటివరకు బయటపడ్డ అతిపెద్ద డైనోల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మహా రాకాసి బల్లి ఏకంగా 85 అడుగుల పొడవుండేది. అంటే స్కూలు బస్సులు మూడు ఒకదాని తర్వాత ఒకటి పెడితే ఎంతుంటాయో అంత అనుకోవచ్చు. ఇక బరువు 65 టన్నులు. అంటే 65వేల కేజీలు. పన్నెండు ఆఫ్రికా ఏనుగుల బరువుతో సమానమన్నమాట. దీని ఎత్తు 30 అడుగులపైనే. ద్రవ్యరాశిలో భూమ్మీద బతికిన అన్ని జంతువులకన్నా ఇదే పెద్దదని పరిశోధకులు ఆశ్చర్యంతో చెప్పుకునేవారట .

* ఇంతకీ దీని పేరు చెప్పనేలేదు కదూ! dreadnoughtus schrani. దీనర్థం భయంలేనిదని. దీనికి శత్రువులంటూ ఏవీ ఉండేవి కాదట. అందుకే 'నో ఫియర్‌' అని పెట్టారు. శాస్త్రీయనామం పలకడానికి నాలుక తిరగట్లేదా? అందుకే ముద్దు పేరు డ్రెడ్‌ అని కూడా పెట్టారు.

* ఈ డైనో తోక 30 అడుగులు ఉండేది. మెడ 37 అడుగుల పొడవుండేది. ఇంకా నయం ఇదున్నప్పుడు మనముంటే కరకరా నమిలేసేదేమో! అనుకోకండి. ఎందుకంటే ఇది శాకాహారి. నిల్చున్న దగ్గర్నుంచే ఎటూ కదలకుండా ఎంత పెద్ద చెట్టు ఆకుల్నైనా ఆంఫట్‌ అనిపించేదిట.
* ఇంతకీ ఇది ఎక్కడ బతికేది? ఈ మధ్య డ్రెక్సెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అర్జెంటీినాలోని పాటగోనియా ప్రాంతంలో తవ్వకాలు జరిపితే వీటి శిలాజాలు బయటపడ్డాయి. ఇది వరకు దొరికిన ఏ డైనో అస్థిపంజరం దీనిలా పూర్తిస్థాయిలో లభించలేదట. ఈ డైనోకు చెందిన 16 టన్నుల బరువున్న శిలాజాలు దొరికాయి. వాటిని బట్టి కంప్యూటర్లలో పెట్టి దీని రూపం ఎలా ఉండేదో వూహించారు.

* ఈ డైనో 7 కోట్ల 70 లక్షల ఏళ్ల క్రితం భూమిపై తిరగాడిందని తెలుసుకున్నారు. ఇది నాలుగు కాళ్లతో ఉండే టిటనోసార్‌ జాతికి చెందినది.

* ఇది ఉన్నచోటి నుంచి ఎక్కువగా కదిలేది కాదు, దృఢమైన తోకే దీని ఆయుధం. తోకతో శత్రువుల్ని చటుక్కున బంధించేసేదిట. తిన్నది అరిగించుకోవడానికి పొట్టను అటూ ఇటూ ఊపడం వల్ల కొన్ని రకాల స్రవాలు విడుదలై, వాటితోనే ఆహారం అరిగి కావాల్సిన శక్తిని గ్రహించుకునేది.

* నదులు ఉప్పొంగి బాగా వరదలు రావడం వల్లే ఈ భారీ డైనో జాతి అంతమైందని తేలింది.

  • ============================

 Visit my website : Dr.Seshagirirao.com _

No comments:

Post a Comment

Thanks for your comment !