చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్‌లు, మానవులు - వీరంతా హోమినిడే అనే జీవ కుటుంబానికి చెందిన జంతువులు. వీటిలో పైన చెప్పిన రెండు చింపాజీ జాతులు మానవ జాతికి అతి దగ్గరగా ఉన్న జంతుజాలం.
పూర్తిగా పెద్దదైన మగ చింపాంజీ 35-70 కిలోగ్రాములు బరువుంటుంది. 0.9-1.2 మీటర్లు (3-4 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఆడ చింపాంజీలు 26-50 కిలో గ్రాములు బరువు, 0.66-1 మీటర్లు (2-3½ అడుగులు) ఎత్తు ఉంటాయి.
అడవులలో పెరిగే చింపాంజీలు 40 యేండ్ల వరకు జీవిస్తాయి. పెంపకంలో ఇవి 60 యేళ్ళ వరకు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. టార్జాన్ చిత్రంలో నటించిన "చీతా" అనే చింపాంజీ వయసు 2008 నాటికి 76 సంవత్సరాలు. ఇది ఇప్పటికి రికార్డయిన అత్యంత పెద్ద వయసు గల చింపాంజీ.
సాధారణ చింపాంజీ, మరియు బోనొబో అనే ఈ రెండు జాతులూ ఈదలేవు. ఆఫ్రికా ఖండంలో 1.5-2 మిలియన్ సంవత్సరాల క్రింద కాంగో నది ఏర్పడినపుడు అప్పటి ఒకే జాతి అయిన చింపాజీలు నది దక్షిణాన "బొనొబో"లు గాను, నది ఉత్తరాన సాధారణ చింపాంజీలు గాను పరిణామం చెందాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇలా జాతులు రూపు దిద్దుకోవడాన్ని speciation అంటారు.
చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్‌లు మనుషులలాగానే ఆటల్లోను, కుస్తీలలోను, చక్కిలిగింతలపుడు నవ్వుతున్న శబ్దవ్యక్తీకరణ చేస్తాయి. ఇది అనేక పెంపుడు చింపాజీలలో కనుగొనబడింది. బొనొబోలు సంతోషంగా ఉన్నపుడు, చక్కిలిగింతలు పెట్టినపుడు చిన్నపిల్లలలాగానే ముఖకవళికలను, భావ వ్యక్తీకరణను చూపించాయి. అయితే బోనొబోల నవ్వు (higher frequency) ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. చింపాంజీలు కూడా మనుషులలాగానే చంకలు, పొట్ట వంటి అవయవాలలో చక్కిలిగింత లక్షణాలు కలిగి ఉంటాయి.
గొరిల్లా మరియు చింపాంజీ మధ్య తేడా ఏమిటి ?
- శరీర పరిమాణం : గొరిల్లాలు, చింపాంజీ కంటే రెండురెట్లు పరిమాణం లో పెద్దగా ఉంటాయి.
- రెండూ ప్రైమేట్స్ మరియు పెద్ద మెదళ్ళు .- అయితే , చింపాంజీలు వాటి శరీరముతో పోల్చుకుంటే పెద్ద మెదడు మరియు చిన్న పరిమాణం , కలిగి ఎక్కువ తెలివైన .
- గొరిల్లాస్ చింపాంజీలు పోలిస్తే చేతులు, ఛాతీ మరియు తొడ కండరాలు బలముగా ఉంటాయి .
- చింపాంజీ ముఖం రంగు మరింత పింక్ కానీ గొరిల్లాస్ ముఖం రంగు నలుపు.
- చింపాంజీ పెద్ద చెవులు తల బయటకు అంటుకునే ఉంటాయి .. కానీ గొరిల్లా యొక్క చెవులు చిన్న మరియు తల వెనుక వైపు కు తెరిగి ఉంటాయి .
- తల , నుదురు మరియు గొరిల్లాల మూపురం , పెద్దగా ఉంటాయి...అయితే చింపాంజీల్లో ఆవి చిన్నగా ఉంటాయి,
- చింపాంజీలు కర్లింగ్ పెదవులు ప్రముఖము గా ఉంటాయి. . . గొరిల్లాస్ లో అవి ప్రముఖమైనవి కాదు.
- గొరిల్లా ఒక శాకాహారి , కానీ చింపాంజీలు సర్వభక్షకులు .
- రెండు జంతువులు యొక్క జీవితకాలం ఇతర జంతువులు కంటే ఎక్కువే , కానీ గొరిల్లాస్ చింపాంజీలు కంటే ఎక్కువ నివసిస్తున్నారు .
- సామాజిక నిర్మాణాలు చింపాంజీలు లో కొద్దిగా క్లిష్టమైన .
- అయితే గొరిల్లాస్ మరియు చింపాంజీలు రెండూ సహజంగా ఆఫ్రికాలో ప్రత్యేకంగా ఉంటాయి .
- ============================