సర్ఫింగ్ గురించి మీకు తెలుసుగా. కాళ్లకింద రబ్బర్ పాడ్‌లపై నిల్చుని సముద్రంలోని పెద్దపెద్ద అలల మీద జర్రున జారుతూ పడిపోకుండా విన్యాసాలు చేయడం. మనుషులకే కష్టమైన ఈ ఆటలో కుక్కలు ఆరితేరితే ఆశ్చర్యమే కదూ!
అమెరికాలోని శాండియాగో నగరంలో ప్రతి సంవత్సరం కుక్కలకు సర్ఫింగ్ పోటీలు జరుగుతాయి తెలుసా? ఈ మధ్యనే జరిగిన పోటీల్లోనైతే 65 కుక్కలు తోకలూపుతూ ఠీవీగా తమ యజమానులతోపాటు వచ్చి ఉత్సాహంగా సర్ఫింగ్ చేశాయి. సుమారు రెండువేల మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు కూడా.
ఇక ఈ సర్ఫింగ్ శునకాలు మామూలువి కావు. వీటి పేరిట ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్‌లు, వెబ్‌సైట్లు బోలెడు. అభిమానులు సందేశాలు పంపుతుంటే యజమానులు జవాబులు పంపుతూ ఉంటారు. పైగా ఇవి పోటీలో పాల్గొనాలంటే వాటి యజమానులు సుమారు 2వేల ప్రవేశ రుసుము కడతారు. ఇలా వచ్చిన డబ్బుని శాండియాగోలో పోలీసు కుక్కల విభాగానికి విరాళంగా ఇచ్చేస్తారు. ఇంత ఖర్చు పెట్టి కుక్కల్ని సముద్రంలో కష్టబెట్టకపోతే ఏమని అనుకోకండి. అవి గెలిస్తే ఎంత గుర్తింపో, మర్యాదో! విజేత కుక్కలతోపాటు వాటి యజమానులకు కూడా ఓ మంచి రిసార్ట్‌లో వారం రోజుల పాటు రాచ మర్యాదలు ఉంటాయి. పైగా బహుమతులు కూడా! అందుకే ఇంత హడావుడి. ఇక పెంపుడు కుక్కలకు సర్ఫింగ్‌లో తర్ఫీదునిచ్చే సంస్థలు బోలెడు.
శాండియాగోలో అయిదేళ్లుగా ఈ పోటీలు జరుగుతున్నాయి. పైగా వీటిలో బోలెడు విభాగాలు. కుక్కల వయసును బట్టి బృందాలు ఏర్పాటు చేస్తారు. కుక్కలన్నీ వరసగా నుంచుని ఒకేసారి సర్ఫింగ్ చేయాలి. ఎన్ని అలల మీద పడిపోకుండా నుంచుంది, భయపడిందా, ఆత్మవిశ్వాసం కనిపించిందా లాంటి అంశాలను బట్టి మార్కులుంటాయి.
- ============================
Visit my website : Dr.Seshagirirao.com _
No comments:
Post a Comment
Thanks for your comment !