Monday, November 18, 2013

Owl,గుడ్లగూబ




గుడ్లగూబ ఒక మాంసాహార పక్షి. పురుగులు, చిన్న క్షీరదాలు, చిన్న పక్షులు కొన్ని జాతులలో చేప లు వీటి ఆహారం. గుడ్లగూబ నిచా చర పక్షి. ... గుడ్లగూబ - పెద్ద కనుగుడ్లతో అందవికారంగా ఉండి రాత్రిపూట తిరిగే ఒక పక్షి. ఇవి స్ట్రిగిఫార్మిస్ (Strigiformes) క్రమానికి చెందినవి. వీటిలో సుమారు 200 జాతులు ఉన్నవి. ప్రస్తుతం జీవించివున్న గుడ్లగూబల్ని రెండు కుటుంబాలలో ఉన్నవి. వీనిలో స్ట్రిగిడే (Strigidae) కుటుంబంలో సామాన్యమైన గుడ్లగూబలు మరియు టైటానిడే (Tytonidae) కుటుంబంలో బార్న్ గుడ్లగూబలు ఉన్నాయి.

ఇవి ధృవప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రపంచమంతా విస్తరించాయి. ఆంగ్లభాషలో గుడ్లగూబల సమూహాన్ని పార్లమెంటు అంటారు.

దీన్ని అపశకునపు పక్షిగా భావించకుండా లక్ష్మీదేవి వాహనం గా పెద్దలు చెప్పారు. కారణం ఈ గుడ్లగూబ మనకు నష్టం కలిగించే అనేక కీటకాలను, చిన్న జంతువులనూ తిని బ్రతుకుతుంది. మనిషికి ఏ హానీ చెయ్యదు. పర్యావరణ సమతుల్యతకు ఉండి తీరాల్సిన పక్షి.

మనిషి మరణాన్ని ముందుగా ఊహించగల జీవి గుడ్లగూబ.గుడ్లగూబ అరిస్తే ఎవరో ఒకరు మరణిస్తారనేది నమ్మకము. దేవుని బొమ్మలను వ్రాసేటప్పుడు తలవెనుక చంద్రబింబాన్ని చిత్రకారుడు చిత్రిస్తాడు. ఆ చంద్రబింబాన్ని 'ఆర' అని అంటారు. ఆ ఆర ప్రతి మనిషికి పుట్టి నప్పటి నుండి చని పోయేంత వరకు వుంటుందనేది శాస్త్రీ యం. చనిపోయే ముందు జరిగే ఎన్నో ప్రక్రియలలో మొట్ట మొదటిది 'ఆర' అంతర్థాన మైపోవడం. ఆ ఆర ఎవరికీ కనబడదు. కేవలం గుడ్లగూబలు మాత్రమే చూడగలవు. చావుబతుకుల్లో ఉన్న మనిషిని గుడ్లగూడ చూస్తే చనిపోతాడనే ఆరుస్తుంది. గుడ్లగూబ అరిచిన తర్వాతనే చనిపోయాడని గ్రామ బహిష్కరణ చేస్తుంటారు. గుడ్లగూబ ఇంట్లోకి ప్రవేశిస్తే ఆరు నెలలు తాళం వేసే సాంప్రదాయం ఇంకా కొన్ని గ్రామాలలో వున్నది.
  • ============================
 Visit my website : Dr.Seshagirirao.com _

Saturday, October 19, 2013

Hippopotamus - నీటిగుర్రాలు

  •  

  •  
  నీటిగుర్రాలు పీరు చాలామంది వినే ఉంటారు . అయితే హిప్పోపోటమస్ అంటే చాలామందికి త్వరగా అర్ధమవుతుంది. ఇవి నేల మీద మాత్రమే కాకుండా నీటిలో కూడా జీవిస్తాయి. . కాబట్టి వీటిని ఉభయచరాలు అనవచ్చు కానీ ఇవిం ఎక్కువగా నీటిలోనే గడుపుతాయి. అందుకే నీటిగుర్రాలు అనే పేరు వచ్చింది. ఇవి నీటిలో మునిగి ముక్కు మాత్రమే బయటకు ఉంచి .. అలాగే గంటలు గంటలు ఉంటాయి. నీటిగుర్రాలు నీటిలో తేలికగా ఈదుతాయి. ఇవి పిల్లల్ని కూడా నీటిలోనే కంటాయి. నీటిగుర్రం పిల్లలు నేలీద నడవడానికి ముందు నీటిలో ఈదడం నేర్చుకుంటాయి. ఎక్కవగా రాత్రి సమయాల్లో నీటినుండి బయటకి వస్తాయి. వీటి ప్రదాన ఆహారము పచ్చిగడ్డి .ఇవి కౄరమృగాలు లాగ కనిపిస్తాయి కాని శాఖాహారజంతువులు.

  • ============================
 Visit my website : Dr.Seshagirirao.com

Thursday, October 17, 2013

dracula bat ,డ్రాకులా గబ్బిలం

  •  

  •  


    రాత్రి కాగానే బయల్దేరుతుంది... నిద్రపోతుంటే దగ్గరకొస్తుంది... కోరలు దించి గాయం చేస్తుంది... కావలసినంత రక్తం తాగుతుంది... ఏమిటది? దెయ్యమా? కాదు ఓ గబ్బిలం!

డ్రాకులా ఎవరో తెలుసుగా? రాత్రి వేళ మాత్రమే కనిపించే రక్త పిశాచి. కోరలతో గాయం చేసి రక్తం పీల్చే దీనిపై ఎన్నో కథలు, సినిమాలు ఉన్నాయి. అచ్చం అలాంటి కోరలు, లక్షణాలు ఉన్న జీవి ఒకటుంది. అదే 'వాంపైర్‌ బ్యాట్‌'. వాంపైర్‌ (vampire)అంటే రాత్రివేళ తిరుగుతూ నిద్రపోతున్న వారి రక్తం పీల్చే పిశాచి అని అర్థం. ఈ గబ్బిలం కూడా అలాంటిదే!

* గబ్బిలాల్లో సుమారు 1200 జాతులుంటే, కేవలం రక్తం మాత్రమే తాగి బతికేది ఇదొక్కటే!

* డ్రాకులా సినిమాలకు హాలీవుడ్‌ ప్రసిద్ధి అయితే, ఈ వాంపైర్‌ గబ్బిలం కూడా అమెరికాలోనే ఉండడం విశేషం.

* రక్తపిశాచితో పోలుస్తున్నామని ఇది భారీ ఆకారంతో ఉంటుందనుకోకండి. కేవలం మూడున్నర అంగుళాల పొడవుంటుందంతే. మహా అయితే 60 గ్రాముల బరువు తూగదు!

* విచిత్రం ఏంటంటే ఇది రక్తం పీలుస్తున్నా నిద్రపోతున్న జంతువుకి ఏమీ తెలియదు! దీని లాలాజలం వల్ల ఆ జంతువు చర్మం మొద్దుబారుతుంది.

* కూల్‌డ్రింక్‌ తాగే స్ట్రాలాగే దీని నాలుక కూడా ఉంటుంది.

* మిగతా గబ్బిలాలకు భిన్నంగా ఇది నేలపై నడవగలదు. అవసరమైతే పరిగెడుతుంది కూడా. అందుకు ఇది తన రెక్కల్ని ముడుచుకుని కాళ్లగా మార్చుకోగలదు.

* రాత్రి వేళ వేటకు బయల్దేరగానే ఇది నిద్రపోతున్న ఆవులు, గుర్రాలు, పందుల్లాంటి జంతువులను పసిగడుతుంది. వాటికి దూరంగా నేలపై వాలి నడుచుకుంటూ వాటిపైకి ఎక్కి రక్తం పీల్చుకుంటుంది.

* జంతువుల చర్మానికి ఆనుకున్న నరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోగల వాసన శక్తి దీనికి ఉంటుంది. సరిగ్గా అక్కడే గాయం చేసి నాలుకను చొప్పించగలదు. వైద్యపరీక్షల్లో నరంలోకి ఇంజెక్షన్‌ సూది గుచ్చి రక్తాన్ని లాగినట్టన్నమాట.

* ఇంతాచేసి ఇవి తాగేది కేవలం రెండు చెంచాల రక్తం మాత్రమే. వరసగా రెండు రాత్రులు రక్తం దొరక్కపోతే ఇవి చనిపోతాయి!

* ఒక ఏడాదిలో ఈ వాంపైర్‌ గబ్బిలాలు 100 కలిసి 25 ఆవుల మొత్తం రక్తాన్ని పీల్చేస్తాయని అంచనా!

* వీటిలో మూడు జాతులు ఉన్నాయి.
  • ============================
 Visit my website : Dr.Seshagirirao.com

Red Panda,రెడ్‌ పాండా

  •  

  •  


రోజుకు 16 గంటలు...తింటూనే ఉంటుంది!బొజ్జ నిండిపోగానే...బజ్జుండిపోతుంది! ఏమిటది?
చూడ్డానికి టెడ్డీబేర్‌ లాగా ఉంటుంది. పెద్ద తల, గుండ్రటి చిన్ని చెవులు, బొద్దుగా ఉండే ఒళ్లు. ఎర్రగా, బుర్రగా కనిపించే ఇది 'రెడ్‌ పాండా'

* ప్రపంచంలో రెండే రెండు పాండా జాతులున్నాయి. వాటిలో చిన్నది ఇదే. రెండడుగుల ఎత్తుగా మనింట్లో తిరిగే పిల్లిలా ఉంటుంది.

* ఒట్టి తిండిపోతు. రోజులో 16 గంటలు తింటూనే ఉంటుంది! పగలంతా చెట్లపై కునుకుతీసి రాత్రంతా మేత మేస్తుంది!

* ఇంతా చేసి తినేదేంటో తెలుసా? ఎక్కువగా వెదురు ఆకులే. రోజుకు రెండు లక్షల వెదురు ఆకుల్ని ఆంఫట్‌ మని లాగించేస్తుంది! ప్రపంచంలో ఒకే రకం ఆహారంపై బతికేది ఇదొక్కటే!

* తోక చూశారా! ఎంత పెద్దగా ఉందో! దాదాపు రెండు అడుగులుంటుంది.

* దీనికి బోలెడు పేర్లు. నక్క పోలికలు ఉండటంతో ఫైర్‌ ఫాక్స్‌ అంటారు! వెబ్‌ బ్రౌజర్‌ ఫైర్‌ఫాక్స్‌ పేరు దీన్ని బట్టే వచ్చింది. ముదురు రంగులో ఉంటుందని బ్రైట్‌ పాండా, పిల్లిలా ఉంటుందని క్యాట్‌ బేర్‌, లెస్సెర్‌ పాండా పేర్లతో పిలుస్తారు!

* పాండా అనే పేరు నేపాల్‌ పదం 'పొన్య'(ponya)నుంచి వచ్చింది! పొన్య అంటే వెదురు తినే జంతువని అర్థం.

* పాపం... దీన్ని బొచ్చు కోసం వేటాడి చంపుతున్నారు! అందుకే ప్రస్తుతం వీటి సంఖ్య కేవలం 2,500 మాత్రమే!

* హిమాలయ ప్రాంతాల్లో, నేపాల్‌, చైనా, బర్మాలో ఉండే ఇవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి!

* మన దేశంలోని సిక్కిం రాష్ట్ర జంతువు ఇదే!
  • ============================
 Visit my website : Dr.Seshagirirao.com

Komodo dragon- కొమడో డ్రాగన్‌

  •  

  •  
  
కొమడో డ్రాగన్‌ ఒక  భయంకర బల్లి...  కొమడో డ్రాగన్‌ను చూస్తే గజగజా వణికిపోవాల్సిందే. 10 అడుగుల పొడవు, 140 కేజీల బరువుతో చూడ్డానికి భయంకరమైన రూపం. దీనికి తోడు బలమైన కాళ్లకు పదునైన గోళ్లు. పెద్దపెద్ద జంతువులే కాదు, మనుషుల్ని కూడా కొరుక్కుతినేయగల కొమడో డ్రాగన్‌ పళ్లతో కరిచిందంటే ఏజీవి అయినా ప్రాణాలు వదలాల్సిందే.

* అయితే ఇన్నాళ్లూ ఈ భారీ బల్లి నోట్లో విషపూరితమైన బ్యాక్టీరియా ఉంటుందని అనుకునేవారు. అది జంతువులను పీక్కు తిన్నాక పళ్ల సందుల్లో చిక్కుకు పోయిన మాంసం ఎక్కువ సేపు నిలువ ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియా విషపూరితంగా మారుతుందనుకునే వారు. అందుకే దాన్ని నోటి శుభ్రతలేని జంతువుగా తిట్టుకునేవారు.

* కానీ ఇన్నాళ్లూ దీనిపై ఉన్న మన అభిప్రాయం తప్పని తేలింది. దీని లోపల సహజంగానే విషపు గ్రంథులు ఉంటాయని కొత్తగా బయటపడింది. అది కొరకడం వల్లే జంతువులు చనిపోతున్నాయన్నమాట. ఇది కాటు వేసినప్పుడు గాయం చుట్టూ రక్తం గడ్డ కట్టి, నిదానంగా విషం ఎక్కి జంతువులు చనిపోతున్నాయని తేలింది.

* పైగా మనం ఉదయం బ్రష్‌ చేసినట్టుగా ఈ బల్లి కూడా మాంసాన్ని ఆరగించాక 15 నిముషాలు నాలుకతో నోరును శుభ్రం చేసుకుంటుంది. పైన దవడని కూడా ఆకులపై రుద్ది శుభ్రపరుచుకుంటుందని దీనిపై చేసిన పరిశోధనలో తేలింది.

* ఈ బల్లులు ఇండోనేసియాలోని కొమడో ఐలాండ్‌తోపాటు అక్కడున్న మరి కొన్ని దీవుల్లో ఉన్నాయి. అంతా కలిపి వీటి సంఖ్య 5000 మించదు.

* ఇవి పెద్దపెద్ద జంతువులను సైతం తినేస్తాయి. నీటి గేదెల దగ్గర నుంచి, పందులు, జింకలు, దొరికితే చివరికి మనుషులను కూడా కరకరలాడించేస్తాయి.

* ఒక కొమడో డ్రాగన్‌ ఒకేసారి 80 కిలోల మాంసాన్ని ఆంఫట్‌ అనిపించేయగలదు.

* గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఇవి పరుగెత్తుతాయి.
  • ============================ 
Visit my website : Dr.Seshagirirao.com _

Friday, August 30, 2013

Laughing spider,Happy spider,నవ్వేసాలీడు,హ్యాపీ పేస్‌ స్పైడర్‌




సాలెపురుగును చూస్తే చిరాకు పడతాం...కానీ నవ్వే సాలీడు గురించి తెలుసా?దాని ఆకారం చూస్తే మనకూ నవ్వొస్తుంది...

స్మైలింగ్‌ బంతిని చూశారా! నవ్వించే ముఖంతో మెత్తగా పసుపురంగులో ఉంటుంది. అలాంటి రూపురేఖలతో మనల్ని నవ్వించడానికి మన ముందుకొచ్చింది ఓ సాలీడు.

* మనకు కనిపించే సాలీళ్లు చూడ్డానికే వికారంగా ఉంటాయి. ఇది మాత్రం నవ్వించే రూపంతో ఆశ్చర్యపరుస్తుంది. రూపమే కాదు పేరు వింటే కూడా నవ్వొస్తుంది. 'నననా మకాకి' కానీ దీన్నంతా 'హ్యాపీ పేస్‌ స్పైడర్‌ అనే పిలుస్తారు.

* అయితే ఇది నిజంగా నవ్వుతుంది అనుకోకండి. ఈ సాలీడు వీపుభాగంలో కళ్లు, మూతి లాంటి మచ్చలుంటాయి. వాటిని చూస్తే ఇది నవ్వుతున్నట్టు అనిపించి మనకూ నవ్వు పుడుతుంది.

* ఇదుండేది పసిఫిక్‌ సముద్రంలోని హవాయి దీవుల్లో. పైగా ఈ నవ్వు సాలీడు కేవలం 5 మిల్లీమీటర్లు. అంటే భూతద్దం పెట్టి చూస్తేగానీ కనిపించదు.

* దీని వింత ఆకారాన్ని చూసి ఇతర జీవులు దాని జోలికి ఎక్కువగా రావు. శత్రువులకు దీన్ని తినాలో వద్దో అర్థంకాక తెల్లముఖం వేసుకుంటాయి.

* ఈ సాలీళ్లు పసుపు, నీలం, ఎరుపు రంగుల్లో చూడ్డానికి భలే ముచ్చటగా ఉంటాయి.

* దీనిత శాస్త్రీయనామం 'థెరిడినో గ్రాల్లటర్‌' వీటి కాళ్లు దృఢంగా పొడవుగా ఉంటాయి.

* అతి తక్కువ సంఖ్యలో ఉండే దీన్ని మొదటిసారిగా 1973లో గుర్తించారు.

* స్థానికులకు ఇదంటే ఎంతో ఇష్టం. అందుకే వీటి బొమ్మల్ని టీషర్ట్స్‌, బేస్‌బాల్‌ క్యాప్స్‌, పోస్ట్‌కార్డులాంటి వాటిపై చిత్రించి వాటి ప్రాముఖ్యతను పెంచుతున్నారట!

* ఈ సాలీడు తినే ఆహారం వల్ల దీని దేహంపై ఉండే గుర్తులు మారుతుంటాయి!

* వీటిల్లో బాధ్యతంతా ఆడవాటిదే. గుడ్లు పెట్టిన దగ్గర నుంచి పిల్లలు పెరిగే వరకు పూర్తిగా తల్లి జీవులే చూసుకుంటాయి!

* ఈ సాలీళ్లు ఎక్కువగా వెయ్యి నుంచి ఆరువేల అడుగుల ఎత్తులో ఉండే చెట్ల ఆకులపై ఉండటానికి ఇష్టపడతాయి.

* చిన్న చిన్న కీటకాలను, పురుగుల్ని తినే ఇది మనుషులకు ఎలాంటి హానీ కల్గించదు.

* ఇవి ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరుకున్నాయి!


  • ============================ 

 Visit my website : Dr.Seshagirirao.com 

Lavasoa dwarf lemur-లావాసో డ్వార్ఫ్‌ లెమర్‌








    లెమర్లు తెలుసు... కోతి ముఖం, పిల్లి రూపంతో వింతగొలుపుతాయి... వీటిల్లో ఒక కొత్త జాతిది బయటపడింది... పైగా ఇదో మరుగుజ్జుది!

గుడ్లగూబ లాంటి కళ్లు, పిడికెడు శరీరం, నక్కలాంటి లావాటి తోక. ఇది కొత్తగా బయటపడ్డ ఓ పొట్టి వానరం. పేరు 'లావాసో డ్వార్ఫ్‌ లెమర్‌'.
* ఇది ఎప్పుడో 12 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తల కంటబడింది. అయితే అసలు ఇది ఏ జాతికి చెందుతుందని చెప్పడానికి ఇన్నేళ్లు పరీక్షలు గట్రా జరిపి ఇప్పుడు ఇది లెమర్‌ జాతిదేనని తేల్చారు. లెమర్లు మొత్తం సుమారు వంద జాతులు. వాటిల్లో అయిదు పొట్టి జాతివి ఉన్నాయి. ఈ పొట్టివాటిల్లో ఈ కొత్తదీ చేరిపోయింది.
* లెమర్లు ఆఫ్రికా దగ్గరలోని మడగాస్కర్‌ దీవిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి.
* ఇక ఈ కొత్త వానరాన్ని లావాసో పర్వతాల్లో గుర్తించారు కనుక 'లావాసో డ్వార్ఫ్‌ లెమర్‌' అనే పేరుపెట్టారు!
* ఇది కేవలం పావుకిలో బరువు, 20 అంగుళాల పొడవుంటుంది. గుండ్రని కళ్లు, చిక్కని బొచ్చు, పెద్ద పెద్ద చెవులతో ఉండే వీటి శరీరం ముదురు ఎరుపురంగులో ఉంటుంది.
* ఇవి రాత్రిళ్లు మాత్రమే తిరుగుతాయి. అడవిలో దట్టమైన పొదలపై వీటి కాపురం. చలికాలంలో సోమరిగా నెలలకొద్దీ చెట్లపైనే గడుపుతాయి. మిగితా కాలాల్లో మాత్రం చాలా చురుగ్గా ఉంటాయి!
*వీటి పోలికలు మిగతా లెమర్ల పోలికలకు దగ్గరగానే ఉన్నా, ఓ పట్టాన మనుషుల కంట పడవు. తప్పించుకుపోయే తత్వం ఎక్కువ. అందుకే ఇవి ఎలా జీవిస్తాయో ఎక్కువగా తెలుసుకోవడానికి వీలు కాలేదు.

* ఈ బుల్లి జీవులకు ఇప్పుడు ముప్పువాటిల్లింది. వీటి సంఖ్య చాలా తక్కువ. దాదాపు 50 వరకే ఉన్నాయట! పాపం అంతరించిపోయే దశకు చేరాయి.
* మడగాస్కర్‌ దీవిలో స్థానిక భాషలో 'లెమర్‌' అంటే దెయ్యం అని అర్థం.
* వీటిల్లో అతిపెద్దది ఇంద్రి. ఏడున్నర కిలోల వరకు బరువు పెరుగుతుంది.
* చిన్నది డ్వార్ఫ్‌ మౌస్‌. ఇది కేవలం 10 గ్రాముల బరువుంటుంది.

  • ============================

 Visit my website : Dr.Seshagirirao.com