Thursday, October 17, 2013

dracula bat ,డ్రాకులా గబ్బిలం

  •  

  •  


    రాత్రి కాగానే బయల్దేరుతుంది... నిద్రపోతుంటే దగ్గరకొస్తుంది... కోరలు దించి గాయం చేస్తుంది... కావలసినంత రక్తం తాగుతుంది... ఏమిటది? దెయ్యమా? కాదు ఓ గబ్బిలం!

డ్రాకులా ఎవరో తెలుసుగా? రాత్రి వేళ మాత్రమే కనిపించే రక్త పిశాచి. కోరలతో గాయం చేసి రక్తం పీల్చే దీనిపై ఎన్నో కథలు, సినిమాలు ఉన్నాయి. అచ్చం అలాంటి కోరలు, లక్షణాలు ఉన్న జీవి ఒకటుంది. అదే 'వాంపైర్‌ బ్యాట్‌'. వాంపైర్‌ (vampire)అంటే రాత్రివేళ తిరుగుతూ నిద్రపోతున్న వారి రక్తం పీల్చే పిశాచి అని అర్థం. ఈ గబ్బిలం కూడా అలాంటిదే!

* గబ్బిలాల్లో సుమారు 1200 జాతులుంటే, కేవలం రక్తం మాత్రమే తాగి బతికేది ఇదొక్కటే!

* డ్రాకులా సినిమాలకు హాలీవుడ్‌ ప్రసిద్ధి అయితే, ఈ వాంపైర్‌ గబ్బిలం కూడా అమెరికాలోనే ఉండడం విశేషం.

* రక్తపిశాచితో పోలుస్తున్నామని ఇది భారీ ఆకారంతో ఉంటుందనుకోకండి. కేవలం మూడున్నర అంగుళాల పొడవుంటుందంతే. మహా అయితే 60 గ్రాముల బరువు తూగదు!

* విచిత్రం ఏంటంటే ఇది రక్తం పీలుస్తున్నా నిద్రపోతున్న జంతువుకి ఏమీ తెలియదు! దీని లాలాజలం వల్ల ఆ జంతువు చర్మం మొద్దుబారుతుంది.

* కూల్‌డ్రింక్‌ తాగే స్ట్రాలాగే దీని నాలుక కూడా ఉంటుంది.

* మిగతా గబ్బిలాలకు భిన్నంగా ఇది నేలపై నడవగలదు. అవసరమైతే పరిగెడుతుంది కూడా. అందుకు ఇది తన రెక్కల్ని ముడుచుకుని కాళ్లగా మార్చుకోగలదు.

* రాత్రి వేళ వేటకు బయల్దేరగానే ఇది నిద్రపోతున్న ఆవులు, గుర్రాలు, పందుల్లాంటి జంతువులను పసిగడుతుంది. వాటికి దూరంగా నేలపై వాలి నడుచుకుంటూ వాటిపైకి ఎక్కి రక్తం పీల్చుకుంటుంది.

* జంతువుల చర్మానికి ఆనుకున్న నరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోగల వాసన శక్తి దీనికి ఉంటుంది. సరిగ్గా అక్కడే గాయం చేసి నాలుకను చొప్పించగలదు. వైద్యపరీక్షల్లో నరంలోకి ఇంజెక్షన్‌ సూది గుచ్చి రక్తాన్ని లాగినట్టన్నమాట.

* ఇంతాచేసి ఇవి తాగేది కేవలం రెండు చెంచాల రక్తం మాత్రమే. వరసగా రెండు రాత్రులు రక్తం దొరక్కపోతే ఇవి చనిపోతాయి!

* ఒక ఏడాదిలో ఈ వాంపైర్‌ గబ్బిలాలు 100 కలిసి 25 ఆవుల మొత్తం రక్తాన్ని పీల్చేస్తాయని అంచనా!

* వీటిలో మూడు జాతులు ఉన్నాయి.
  • ============================
 Visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment

Thanks for your comment !