కళ్లు, కాళ్లు, చేతులు, లేని జీవి... ప్రపంచానికే గొప్ప మేలు చేస్తోంది... భూతాపం నుంచి మనల్ని రక్షిస్తోంది... ఆ జీవి ఏంటోతెలుసా?వానపాము! ఈ మాటలు
అంటున్నదెవరో కాదు శాస్త్రవేత్తలు. దాదాపు 30 కోట్ల ఏళ్లుగా నిశ్శబ్దంగా భూమికి మహోపకారం చేశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇవే గనుక భూమ్మీద
లేకపోతే వాతావరణ పరిస్థితులు మరింత దారుణంగా ఉండేవని వారు చెబుతున్నారు. నాలుగేళ్లపాటు పరిశోధన చేశాక వాళ్లకి వానపాముల విలువేంటో
తెలిసింది.
వీటి వల్ల చేకూరుతున్న ప్రయోజనాలు :
వరదల ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి.
కరువు పరిస్థితుల్ని నివారిస్తున్నాయి.
భూతాపాన్ని ఆపుతున్నాయి.
నేలను సారవంతం చేస్తూ ఆహారోత్పత్తిలో కీలక పాత్ర వహిస్తున్నాయి. ఇవి ఎండుటాకుల్లాంటి మొక్కల అవశేషాలను మంచి ఎరువుగా మారుస్తాయి.
మీకు తెలుసా?
* ప్రపంచంలో సుమారు 6000 రకాల వానపాములు ఉన్నాయి.
* ఒక ఎకరం నేలలో పది లక్షల దాకా వానపాములు ఉంటాయి.
* అతి పొడవైన వానపాము రికార్డు 22 అడుగులు. ఇది దక్షిణాఫ్రికాలో దొరికింది.
* వానపాములు పుట్టినప్పుడు బియ్యం గింజ కన్నా చిన్నగా ఉంటాయి.
* వీటి విసర్జితాలు మొక్కలకి ఎరువుగా ఉపయోగపడతాయి.
- ====================
No comments:
Post a Comment
Thanks for your comment !