స్మైలింగ్ బంతిని చూశారా! నవ్వించే ముఖంతో మెత్తగా పసుపురంగులో ఉంటుంది. అలాంటి రూపురేఖలతో మనల్ని నవ్వించడానికి మన ముందుకొచ్చింది ఓ సాలీడు.
* మనకు కనిపించే సాలీళ్లు చూడ్డానికే వికారంగా ఉంటాయి. ఇది మాత్రం నవ్వించే రూపంతో ఆశ్చర్యపరుస్తుంది. రూపమే కాదు పేరు వింటే కూడా నవ్వొస్తుంది. 'నననా మకాకి' కానీ దీన్నంతా 'హ్యాపీ పేస్ స్పైడర్ అనే పిలుస్తారు.
* అయితే ఇది నిజంగా నవ్వుతుంది అనుకోకండి. ఈ సాలీడు వీపుభాగంలో కళ్లు, మూతి లాంటి మచ్చలుంటాయి. వాటిని చూస్తే ఇది నవ్వుతున్నట్టు అనిపించి మనకూ నవ్వు పుడుతుంది.
* ఇదుండేది పసిఫిక్ సముద్రంలోని హవాయి దీవుల్లో. పైగా ఈ నవ్వు సాలీడు కేవలం 5 మిల్లీమీటర్లు. అంటే భూతద్దం పెట్టి చూస్తేగానీ కనిపించదు.
* దీని వింత ఆకారాన్ని చూసి ఇతర జీవులు దాని జోలికి ఎక్కువగా రావు. శత్రువులకు దీన్ని తినాలో వద్దో అర్థంకాక తెల్లముఖం వేసుకుంటాయి.
* ఈ సాలీళ్లు పసుపు, నీలం, ఎరుపు రంగుల్లో చూడ్డానికి భలే ముచ్చటగా ఉంటాయి.
* దీనిత శాస్త్రీయనామం 'థెరిడినో గ్రాల్లటర్' వీటి కాళ్లు దృఢంగా పొడవుగా ఉంటాయి.
* అతి తక్కువ సంఖ్యలో ఉండే దీన్ని మొదటిసారిగా 1973లో గుర్తించారు.
* స్థానికులకు ఇదంటే ఎంతో ఇష్టం. అందుకే వీటి బొమ్మల్ని టీషర్ట్స్, బేస్‌బాల్ క్యాప్స్, పోస్ట్‌కార్డులాంటి వాటిపై చిత్రించి వాటి ప్రాముఖ్యతను పెంచుతున్నారట!
* ఈ సాలీడు తినే ఆహారం వల్ల దీని దేహంపై ఉండే గుర్తులు మారుతుంటాయి!
* వీటిల్లో బాధ్యతంతా ఆడవాటిదే. గుడ్లు పెట్టిన దగ్గర నుంచి పిల్లలు పెరిగే వరకు పూర్తిగా తల్లి జీవులే చూసుకుంటాయి!
* ఈ సాలీళ్లు ఎక్కువగా వెయ్యి నుంచి ఆరువేల అడుగుల ఎత్తులో ఉండే చెట్ల ఆకులపై ఉండటానికి ఇష్టపడతాయి.
* చిన్న చిన్న కీటకాలను, పురుగుల్ని తినే ఇది మనుషులకు ఎలాంటి హానీ కల్గించదు.
* ఇవి ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరుకున్నాయి!
- ============================
Visit my website : Dr.Seshagirirao.com