Tuesday, September 23, 2014

Zeebra fish- జీబ్రా చేపలు.

  •  




  •     జీబ్రా  చేపలు.


* తెలుపు నలుపు చారలతో ఉండే జీబ్రాల గురించి తెలుసు. మరి జీబ్రా చారలతో ఉండే ఈ చేప నీళ్లలో మిలమిల మెరిసిపోతూ భలే ముచ్చటగా దేహంపై నీలం రంగు చారలు అచ్చం జీబ్రా చారల్లానే ఉంటాయి. అందుకే వీటిని జీబ్రా చేపలంటారు. అసలు ఈ చేపపై చారలు ఎందుకు ఏర్పడతాయో శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు.

* దేహంపై ఎవరో గీసినట్టే రంగు రంగుల్లో ఉండే ఈ చారల గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరీక్షలు చేశారు. చివరకు ఈ చేపల్లోని వర్ణ కణాల వల్లే ఈ చారలు ఏర్పడతాయని తెలిసింది.

* ఈ చేపల్లో నలుపు, పసుపు రంగు కణాలు, వెండి వర్ణంలో ఉండే సిల్వరీ కణాలు ఉంటాయి. ఇవి పుట్టిన వెంటనే మెదడు నుంచి పసుపు కణాలు పుట్టుకొచ్చి చర్మాన్ని కప్పివేస్తాయి. తర్వాత రెండు, మూడు వారాలకు అవి పెరుగుతూ విస్తరిస్తాయి. తర్వాత వెన్నెముక నుంచి సిల్వరీ, నలుపు కణాలు ఏర్పడి చర్మం పొరల్లో కలిసిపోతూ చారల్ని ఏర్పరుస్తాయి. ఈ కణాలకు రంగు, ఆకారం మార్చే శక్తి కూడా ఉంటుంది. దాంతో శరీరంపై బంగారు వర్ణం చారల మధ్య నీలం రంగు వచ్చేలా చారల్ని ఏర్పరుస్తాయి. ఈ కణాలే చారలకు కారణమన్నమాట.

* ఈ పరిశీలన వల్ల పులి, జీబ్రా వంటి వాటిల్లో వాటి రంగు, చారల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

* జీబ్రా చేపల్ని ఎన్నో పరిశోధనల కోసం వాడతారు. ఎందుకంటే వీటి చర్మం పారదర్శకంగా ఉండి, మైక్రోస్కోప్‌ కింద చక్కగా కనిపిస్తుందిట. అంతేకాదు మన మెదడు జెనెటిక్‌ కోడ్‌తో పోలిస్తే జీబ్రా చేప మెదడుకు 90 శాతం సరిపోలుతుందిట.

* బంగారు, వెండి వర్ణంలో ఆకర్షణీయంగా ఉండే ఈ చేపలు ఎక్కువగా మన దేశంలోనే కనిపిస్తాయి. మంచి నీళ్లలో మాత్రమే ఉంటాయి. భలే అందంగా ఉండడంతో ఎక్కువగా అక్వేరియాల్లో పెంచుతుంటారు.

* ఇవి మొప్పల్ని, గుండె కండరాల్ని కూడా పునరుత్పత్తి చేసుకోగలవు. మనలానే వీటికి వెన్నెముక ఉంటుంది.

* వీటిల్లో మగ చేప జత కట్టిన ఆడ చేపతోనే ఉంటుందిట.

* సన్నగా ఉండే ఇవి రెండున్నర అంగుళాల పొడవుంటాయి.

 
  • ============================
 Visit my website : Dr.Seshagirirao.com _

Dreadnoughtus schrani Dynosar -డ్రెడ్‌నాటస్ స్రాని డైనోసార్

  •  

  •  Dreadnoughtus schrani Dynosar- డ్రెడ్‌నాటస్ స్రాని డైనోసార్
 

పురాణ కథల్లో భారీ పరిమాణంతో ఉన్న రాక్షసుల గురించి వినే ఉంటారు. నిజంగా అంత పెద్ద డైనోసార్‌ ఒకప్పుడు భూమ్మీద బతికేవి . ఇది ఇప్పటివరకు బయటపడ్డ అతిపెద్ద డైనోల్లో ఒకటిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మహా రాకాసి బల్లి ఏకంగా 85 అడుగుల పొడవుండేది. అంటే స్కూలు బస్సులు మూడు ఒకదాని తర్వాత ఒకటి పెడితే ఎంతుంటాయో అంత అనుకోవచ్చు. ఇక బరువు 65 టన్నులు. అంటే 65వేల కేజీలు. పన్నెండు ఆఫ్రికా ఏనుగుల బరువుతో సమానమన్నమాట. దీని ఎత్తు 30 అడుగులపైనే. ద్రవ్యరాశిలో భూమ్మీద బతికిన అన్ని జంతువులకన్నా ఇదే పెద్దదని పరిశోధకులు ఆశ్చర్యంతో చెప్పుకునేవారట .

* ఇంతకీ దీని పేరు చెప్పనేలేదు కదూ! dreadnoughtus schrani. దీనర్థం భయంలేనిదని. దీనికి శత్రువులంటూ ఏవీ ఉండేవి కాదట. అందుకే 'నో ఫియర్‌' అని పెట్టారు. శాస్త్రీయనామం పలకడానికి నాలుక తిరగట్లేదా? అందుకే ముద్దు పేరు డ్రెడ్‌ అని కూడా పెట్టారు.

* ఈ డైనో తోక 30 అడుగులు ఉండేది. మెడ 37 అడుగుల పొడవుండేది. ఇంకా నయం ఇదున్నప్పుడు మనముంటే కరకరా నమిలేసేదేమో! అనుకోకండి. ఎందుకంటే ఇది శాకాహారి. నిల్చున్న దగ్గర్నుంచే ఎటూ కదలకుండా ఎంత పెద్ద చెట్టు ఆకుల్నైనా ఆంఫట్‌ అనిపించేదిట.
* ఇంతకీ ఇది ఎక్కడ బతికేది? ఈ మధ్య డ్రెక్సెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అర్జెంటీినాలోని పాటగోనియా ప్రాంతంలో తవ్వకాలు జరిపితే వీటి శిలాజాలు బయటపడ్డాయి. ఇది వరకు దొరికిన ఏ డైనో అస్థిపంజరం దీనిలా పూర్తిస్థాయిలో లభించలేదట. ఈ డైనోకు చెందిన 16 టన్నుల బరువున్న శిలాజాలు దొరికాయి. వాటిని బట్టి కంప్యూటర్లలో పెట్టి దీని రూపం ఎలా ఉండేదో వూహించారు.

* ఈ డైనో 7 కోట్ల 70 లక్షల ఏళ్ల క్రితం భూమిపై తిరగాడిందని తెలుసుకున్నారు. ఇది నాలుగు కాళ్లతో ఉండే టిటనోసార్‌ జాతికి చెందినది.

* ఇది ఉన్నచోటి నుంచి ఎక్కువగా కదిలేది కాదు, దృఢమైన తోకే దీని ఆయుధం. తోకతో శత్రువుల్ని చటుక్కున బంధించేసేదిట. తిన్నది అరిగించుకోవడానికి పొట్టను అటూ ఇటూ ఊపడం వల్ల కొన్ని రకాల స్రవాలు విడుదలై, వాటితోనే ఆహారం అరిగి కావాల్సిన శక్తిని గ్రహించుకునేది.

* నదులు ఉప్పొంగి బాగా వరదలు రావడం వల్లే ఈ భారీ డైనో జాతి అంతమైందని తేలింది.

  • ============================

 Visit my website : Dr.Seshagirirao.com _

Gaint Sloth-రాకాసి స్లోత్‌

  •  

  • Gaint Sloth-రాకాసి స్లోత్‌
* బద్ధకానికి మారుపేరైన స్లోత్‌లు  కదలడంలో నెమ్మదైనా  వీటి శరీర పరిణామక్రమం చాలా వేగంగా పెరుగుతుందట. స్లోత్‌లది వింతైన రూపం. రోజులో ఎక్కువ భాగం నిద్రలోనే గడుపుతాయి. బద్ధకానికి మారుపేరుగా పిలుస్తారు. అయితే ఈ జీవిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే ఒక కొత్త సంగతి తెలిసింది.

* ఇప్పటి స్లోత్‌లు కుక్కంత సైజు, ఎనిమిది కేజీల బరువుతో ఉంటాయి. కానీ 11వేల ఏళ్ల క్రితం ఏకంగా ఏనుగంత పెద్దగా ఉండేవి. వాటిని చూస్తే ఏ జీవికైనా హడలు పుట్టేదట. స్లోత్‌లు ఒకప్పుడు అంత పెద్దగా ఉండేవనే సంగతి గతంలోనే తెలుసు.

* ఇప్పుడు కొత్తగా బయటపడ్డ విషయమేంటంటే... వీటి శరీర పరిణామక్రమం చాలా వేగంగా పెరిగిందని. ఎంతంటే లక్ష ఏళ్లకోసారి వీటి బరువు 100 కేజీలు పెరిగేదిట. అంటే లక్షలాది ఏళ్ల క్రితం చిన్నగా ఉన్న స్లోత్‌లు క్రమంగా పెద్దగా పెరుగుతూ వచ్చి ఏనుగంత సైజుకు చేరుకున్నాయి.

* అయినా లక్ష ఏళ్లకు వంద కేజీల పెరుగుదల అంటే తక్కువేగా అంటారేమో! క్షీరదాల్లో మరే జీవి బరువు ఇంత వేగంగా పెరగలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

* ఏనుగంత పెద్దగా ఉన్న ఈ స్లోత్‌ జాతి పేరు megatherium, ఇవి ఉత్తర అమెరికా ఖండంలో తిరగాడేవి. వీటిని జెయింట్‌ స్లోత్‌ అంటారు. వీటి గోళ్లే ఒక అడుగు పొడవు ఉండేవి. అంటే కత్తుల్లా కనిపించేవి.

* జెయింట్‌ స్లోత్‌ జాతి 11,000 ఏళ్ల క్రితం వాతావరణ మార్పుల వల్ల పూర్తిగా అంతరించిపోయింది!
మీకు తెలుసా?
* ఇప్పుడున్న స్లోత్‌లలో 6 జాతులు ఉన్నాయి. వాటిలో కొన్ని రెండు వేళ్లవి, మరికొన్ని మూడు వేళ్లవి.
* స్లోత్‌లు ఇప్పుడు దక్షిణ అమెరికా అడవుల్లో మాత్రమే జీవిస్తాయి!
* ఇవి రోజులో 15 నుంచి 20 గంటలు నిద్రిస్తాయి. అదీ చెట్లమీదే!
* వారానికి ఒకసారి మూత్ర విసర్జనకు, జలకాలాటకు చెట్లు దిగి కిందికి వస్తాయంతే! వీటి నడక, చెట్లు ఎక్కడం చాలా నిదానంగా ఉంటుంది. నిముషానికి అయిదారు అడుగుల దూరం నడవగలవు!
* ఆహారం జీర్ణం కావడానికి సుమారు నెల రోజులు పడుతుంది!

  • ============================

 Visit my website : Dr.Seshagirirao.com _

pudu deer-పుడూ జింక


  •  

  •  
మన పేజీలో కనిపిస్తున్న ఈ జీవిని చూస్తే అరే ఇదేదో వింతగా ఉందే ముద్దు ముద్దుగా జింక బొమ్మలా అనుకుంటున్నారా? ఇది నిజంగా జింకే. ప్రపంచంలోనే అతి చిన్న జింక జాతి. పేరు పుడూ. మనలో పొట్టి మనుషులున్నట్టే వీటి జాతిలో ఇదే పొట్టిదన్నమాట. ఈ మధ్యే పుట్టిన ఇది దాని పరిమాణం వల్లే ప్రముఖురాలైంది.

* దీన్ని చూడాలంటే న్యూయార్క్‌లోని క్వీన్స్‌ జంతు ప్రదర్శనశాలకు వెళ్లాల్సిందే.

* పుట్టినప్పుడు కేవలం అరకిలో బరువు మాత్రమే ఉంది. మామూలుగా అయితే పుడూ జాతి జింకలు 13 నుంచి 17 అంగుళాల ఎత్తు, 33 అంగుళాల వరకు పొడవుంటాయిట. కానీ ఇది అలా కాదు. పూర్తిగా పెరిగినా 23 అంగుళాల పొడవు, తొమ్మిది కిలోల బరువుకు మించదు.

* ఈ జాతి జింకలు ఎక్కువగా ఉండేది చిలీ, అర్జెంటీనా అడవుల్లోనే. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, వేటాడటం వంటి చర్యల వల్ల ప్రస్తుతం అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. అందుకే చిలీలో వీటి సంఖ్యను పెంచడానికి రక్షణ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే క్వీన్స్‌ జూలో వీటికి అనువైన పరిస్థితుల్ని ఏర్పాటు చేశారు. పైగా జూలో పుట్టిన మొదటి పుడూ జింక పిల్ల కూడా ఇదే తెలుసా?

* ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య సుమారు పది వేలలోపే!

* దీన్ని స్థానిక భాషలో 'మాపుడుంగన్‌' అని పిలుస్తారు. అలా ఈ జింకకు పుడూ అనే పేరొచ్చింది.

* ఇవి ఆకులు, కొమ్మలు, గడ్డి, క్యారెట్లు వంటి తింటూ బతికేస్తాయి.

* శత్రువులు కనిపించగానే చిందరవందరగా పరుగులు తీస్తూ క్షణాల్లో మాయమవుతాయిట.

* ముదురు ఎరుపు, గోధుమ రంగులో ఒత్తయిన బొచ్చుతో ఉండే వీటిల్లో రెండు ఉపజాతులుంటాయి.

* మామూలు జింకల కన్నా కాస్త భిన్నంగా వీటి తలపై రెండు కొమ్ముల్లాంటి భాగాలు ఉంటాయి. ఈ కొమ్ములు ఏడాదికోసారి ఊడిపోతూ మళ్లీ కొత్తగా వస్తుంటాయి. వీటికో బుల్లి తోక కూడా ఉంటుంది.

* పరిసరాల్ని పసిగట్టే చురుకుతనం ఎక్కువ. అంతేకాదు వేగంగా పరుగెత్తడం, చెట్లెక్కడం లాంటివి చేస్తుంటాయి.

  • ============================ 
Visit my website : Dr.Seshagirirao.com _

Mantis shrimp - మాంటీస్‌ ష్రింపు

  •  


  •  
కళ్లతో ఏం చేస్తాం? పరిసరాల్ని చూస్తాం...    కానీ ఓ జీవి మాత్రం కళ్లతోనే తనపై ఏ చూపు పడకుండా చేస్తుంది. కళ్లతో చూడ్డం తెలుసు. కానీ కళ్లతోనే కనిపించకుండా మాయమవ్వడం తెలుసా? వింటేనే విచిత్రంగా ఉన్నా రొయ్య జాతికి చెందిన మాంటీస్‌ ష్రింపు ఆ పనే చేస్తుంది. కళ్లతో కాంతులు వెదజల్లుతూ తనని తాను రక్షించుకుంటుంది. శత్రువుల చూపు తనమీద పడకుండా మాయ చేస్తుంది.
* ఆసక్తికరమైన ఈ సంగతులన్నీ శాస్త్రవేత్తలు వాటిపై చేసిన పరిశోధనలో బయటపడ్డాయి.

* మామూలుగా అయితే ఈ మాంటీస్‌ ష్రింపులు చురకత్తిలాంటి చూపులతో మనం చూడలేని రంగుల్ని కూడా పసిగట్టేస్తాయి. వీటిల్లో పెద్దవి శత్రువులపై దాడి చేసి, లేదంటే ముందే వాటి ఉనికిని గుర్తించి తప్పించుకుంటాయి. మరి ఇవి లార్వా దశలో ఉన్నప్పుడు బలహీనంగా ఉంటాయి కాబట్టి ఏం చేస్తాయో తెలుసా? కళ్లతోనే మాయ చేస్తాయి. నీటిలో చూడ్డానికి వీలు లేకుండా అదృశ్యం అవుతాయి. పారదర్శకంగా మారిపోతాయి.
* మేరీలాండ్‌ బల్టిమోర్‌ కౌంటీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు వీటి కళ్ల వెనుకున్న కిటుకు గురించి తెలుసుకోవడానికి పరిశోధన మొదలెట్టారు. ఆస్ట్రేలియాలోని లిజర్డ్‌ దీవిలో ఉన్న పరిశోధనశాలలో ఉంచి తెల్లని కాంతి కిరణాల్ని వాటిపై ప్రసరించేలా చేశారు.

* కాంతి కిరణాలు పడగానే మొదట ష్రింపు లార్వాలు వాటి కంటి పైభాగం నుంచి ఆకుపచ్చ కాంతుల్ని, తర్వాత కంటి కింది భాగం నుంచి నీలం రంగు కిరణాల్ని ప్రతిబింబించేలా చేశాయిట. అలా మెరిసే వీటి కళ్లు ప్రసరించే కాంతుల వల్లే అవి పరిసరాల్లో కలిసిపోయినట్టుగా ఉండి ఇతర జీవులకు కనిపించకుండా ఉంటాయన్నమాట.

* ఈ విన్యాసాలు ఫొటోలో బంధించడానికి వీలు పడకుండా ఉంటాయిట.

* ష్రింపులకు చూపు కూడా చాలా ఎక్కువే. అతినీలలోహిత కిరణాల్ని సైతం చూడగలవు. బయటకి పొడుచుకుని వచ్చినట్టు ఉండే వీటి కనుగుడ్లు దేనికదే తిరిగేలా ఉంటాయి.

* లార్వాలు ఎదిగాక కళ్లతోనే పరిసరాల్ని కూడా పసిగట్టి శత్రువును గుర్తిస్తాయిట. ఎంత దూరంలో ఉన్న శత్రువునైనా గంటకు 90కిలో మీటర్ల వేగంతో వెళ్లి చటుక్కున చంపేస్తాయి. అందుకే దీన్ని 'థంబ్‌ స్పిట్లర్‌' అంటారు. 

  • ============================ 
 Visit my website : Dr.Seshagirirao.com _

Friday, March 28, 2014

Chimpanzee, చింపాంజీ

  •  
  •  
 చింపాంజీ (Chimpanzee) హోమినిడే కుటుంబానికి చెందిన జంతువు. నిటారుగా నిలబడక చేతులను కూడా నడవడానికి ఉపయోగిస్తుంది. "చింపాంజీ" అనే పదాన్ని రెండు వేరువేరు కోతి జాతుల జంతువులకు వాడుతారు (two species of apes in the genus Pan).వీటిలో ఒకటి పశ్చిమ ఆఫ్రికా, మధ్య ఆఫ్రికా ప్రాంతాలలో వివసించేది. దానిని అంగ్లంలో Common Chimpanzee అనీ, శాస్త్రీయంగా Pan troglodytes అనీ అంటారు. రెండవ జాతి చింపాంజీలు కాంగో పరిసర ప్రాంతాలలో ఉంటాయి. ఆ జాతి సాధారణ నామం బొనొబో. శాస్త్రీయ నామం Pan paniscus. ఆఫ్రికాలో ఈ రెండు జాతుల చింపాజీల నివాస స్థలాలకు కాంగో నది సరిహద్దుగా ఉంటున్నది.

చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్‌లు, మానవులు - వీరంతా హోమినిడే అనే జీవ కుటుంబానికి చెందిన జంతువులు. వీటిలో పైన చెప్పిన రెండు చింపాజీ జాతులు మానవ జాతికి అతి దగ్గరగా ఉన్న జంతుజాలం.

పూర్తిగా పెద్దదైన మగ చింపాంజీ 35-70 కిలోగ్రాములు బరువుంటుంది. 0.9-1.2 మీటర్లు (3-4 అడుగులు) ఎత్తు ఉంటుంది. ఆడ చింపాంజీలు 26-50 కిలో గ్రాములు బరువు, 0.66-1 మీటర్లు (2-3½ అడుగులు) ఎత్తు ఉంటాయి.
అడవులలో పెరిగే చింపాంజీలు 40 యేండ్ల వరకు జీవిస్తాయి. పెంపకంలో ఇవి 60 యేళ్ళ వరకు బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. టార్జాన్ చిత్రంలో నటించిన "చీతా" అనే చింపాంజీ వయసు 2008 నాటికి 76 సంవత్సరాలు. ఇది ఇప్పటికి రికార్డయిన అత్యంత పెద్ద వయసు గల చింపాంజీ.
సాధారణ చింపాంజీ, మరియు బోనొబో అనే ఈ రెండు జాతులూ ఈదలేవు. ఆఫ్రికా ఖండంలో 1.5-2 మిలియన్ సంవత్సరాల క్రింద కాంగో నది ఏర్పడినపుడు అప్పటి ఒకే జాతి అయిన చింపాజీలు నది దక్షిణాన "బొనొబో"లు గాను, నది ఉత్తరాన సాధారణ చింపాంజీలు గాను పరిణామం చెందాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఇలా జాతులు రూపు దిద్దుకోవడాన్ని speciation అంటారు.

చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్‌లు మనుషులలాగానే ఆటల్లోను, కుస్తీలలోను, చక్కిలిగింతలపుడు నవ్వుతున్న శబ్దవ్యక్తీకరణ చేస్తాయి. ఇది అనేక పెంపుడు చింపాజీలలో కనుగొనబడింది. బొనొబోలు సంతోషంగా ఉన్నపుడు, చక్కిలిగింతలు పెట్టినపుడు చిన్నపిల్లలలాగానే ముఖకవళికలను, భావ వ్యక్తీకరణను చూపించాయి. అయితే బోనొబోల నవ్వు (higher frequency) ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. చింపాంజీలు కూడా మనుషులలాగానే చంకలు, పొట్ట వంటి అవయవాలలో చక్కిలిగింత లక్షణాలు కలిగి ఉంటాయి.

గొరిల్లా మరియు చింపాంజీ మధ్య తేడా ఏమిటి ?

- శరీర పరిమాణం : గొరిల్లాలు, చింపాంజీ కంటే  రెండురెట్లు  పరిమాణం లో పెద్దగా ఉంటాయి.

- రెండూ ప్రైమేట్స్ మరియు పెద్ద మెదళ్ళు .- అయితే , చింపాంజీలు వాటి శరీరముతో పోల్చుకుంటే పెద్ద మెదడు మరియు చిన్న పరిమాణం , కలిగి ఎక్కువ తెలివైన .

- గొరిల్లాస్ చింపాంజీలు పోలిస్తే  చేతులు, ఛాతీ మరియు తొడ కండరాలు బలముగా ఉంటాయి .

- చింపాంజీ ముఖం రంగు మరింత పింక్ కానీ గొరిల్లాస్ ముఖం రంగు నలుపు.

- చింపాంజీ పెద్ద చెవులు తల బయటకు అంటుకునే ఉంటాయి .. కానీ గొరిల్లా యొక్క చెవులు చిన్న మరియు తల వెనుక వైపు కు తెరిగి ఉంటాయి .

-  తల , నుదురు మరియు గొరిల్లాల మూపురం , పెద్దగా ఉంటాయి...అయితే  చింపాంజీల్లో ఆవి  చిన్నగా ఉంటాయి,

- చింపాంజీలు కర్లింగ్ పెదవులు ప్రముఖము గా ఉంటాయి.  . . గొరిల్లాస్ లో అవి ప్రముఖమైనవి కాదు.

- గొరిల్లా ఒక శాకాహారి , కానీ చింపాంజీలు  సర్వభక్షకులు .

- రెండు జంతువులు యొక్క జీవితకాలం ఇతర జంతువులు కంటే ఎక్కువే , కానీ గొరిల్లాస్ చింపాంజీలు కంటే ఎక్కువ నివసిస్తున్నారు .

- సామాజిక నిర్మాణాలు చింపాంజీలు లో కొద్దిగా క్లిష్టమైన .

- అయితే  గొరిల్లాస్ మరియు చింపాంజీలు రెండూ  సహజంగా ఆఫ్రికాలో ప్రత్యేకంగా ఉంటాయి .



  • ============================ 
Visit my website : Dr.Seshagirirao.com

Africa Lions,ఆఫ్రికా సింహాలు



 సింహాలకు చిరునామా ఆఫ్రికా...ఆ ఫ్రికా అంటేనే అడవులు గుర్తొస్తాయి. ఆ ఖండంలో దక్షిణ ప్రాంతంలో చిక్కనైన, దట్టమైన అడవులు ఎక్కువగా కనిపిస్తాయి. ఒకప్పుడు ఇదంతా సింహాల నిలయం. వాటి గర్జనలు మారుమోగేవి. మరిప్పుడో? ఆ వైభవమే లేదు. మృగరాజుల సంఖ్య చాలా తగ్గిపోయింది. శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే అవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.
* శాస్త్రవేత్తలు ముఖ్యంగా మగ సింహాల లెక్కలు తెలుసుకోవడానికి గత ఆరేళ్లు సెనెగల్‌ నుంచి నైజీరియా వరకు 11 దేశాల్లో దాదాపు 2,414 కిలోమీటర్లు సర్వే చేశారు. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో వేలాది మగ సింహాలు తిరగాడేవి. కానీ ఇప్పుడు కేవలం 250 మాత్రమే ఉన్నట్టు లెక్కతేలింది.
* సింహాల్లో జాతులుంటాయని తెలుసుగా? అలా ఇప్పుడు 'పాంథరా లియో' అనే జాతి సింహాల గురించి ఆరాతీశారు. వీటిల్లో మగవైతే ఏకంగా 8 అడుగుల పొడవు, 250 కేజీల వరకు బరువు పెరుగుతాయి. గంటకు 59 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు.
* కొన్నేళ్ల క్రితం వీటి సంఖ్యను లెక్కగడితే దాదాపు 1300 ఉన్నాయని తేలింది. కానీ ఇప్పుడు వీటి సంఖ్య మరింత తగ్గింది.
* అయినా సింహాల సంఖ్య ఎందుకు తగ్గుతున్నట్టు? అంటే అడవుల్ని కొట్టేయడం, వేటాడటం, ఇవి తిరగడానికి అనువైన పరిస్థితులు లేకపోవడం, పరిరక్షణ చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల వీటి సంఖ్య చాలా తగ్గిపోయింది.

* మగ సింహం గర్జిస్తే 8 కిలోమీటర్ల వరకు ఆ ధ్వని వినిస్తుంది!
* సింహాలు ఎక్కువగా పెద్ద జంతువులైన జీబ్రాలు, అడవి దున్నలనే వేటాడతాయి!
* సింహాలు 10 నుంచి 15 సమూహంగా తిరుగుతాయి. ఈ గుంపును Pride అంటారు.
* ఆడవి రోజుకు 5 కేజీల మాంసాన్ని తింటే, మగవి 7 కిలోల మాంసాన్ని లాగించేస్తాయి!
* సింహాలకు ఈత కూడా వచ్చు!
* వేగంగా పరిగెడుతూ ఒకేసారి 36 అడుగుల దూరం దూకగలవు!

============================
 Visit my website : Dr.Seshagirirao.com

Yongjinglong datangi Dianosaur, యాంగ్జింగ్లాంగ్ డటంగి డైనోసార్

  •  
  •  
*ఇప్పటి వరకు భూమిపై ఉన్న జీవుల్లో  దీనిదే పే...ద్ద ఆకృతి. డైనోల్లోనే అతి పెద్ద ఆకారమున్న పెద్దన్న. అరవై అడుగుల భారీ ఆకారం... పది కోట్ల సంవత్సరాల క్రితం నాటి జీవి...
* శాస్త్రవేత్తలు ఈ మధ్యే నన్ను కనుగొన్నారు. చైనాలో Lanzhou-Minhe పరివాహక ప్రాంతంలో దీని శిలాజాలు దొరికాయి. వాటిని బట్టి కంప్యూటర్లో ఊహా చిత్రం గీస్తే ఇలా దీని  ఆకృతి వచ్చింది. అంతేకాదు దీని గురించి ఆసక్తికరమైన విషయాలు కూడా బయట పడ్డాయి.
*ఇవి ఎంత పొడవుండేవంటే ఏకంగా 60 అడుగులు! అంటే సుమారు రెండు బస్సుల పొడవంత. భూమిపై తిరగాడిన జీవుల్లో వీటిదే భారీ ఆకారమని  పరిశోధకులు అంటున్నారు.
* కేవలం వీటి భుజం ఎముకలే దాదాపు ఆరున్నర అడుగులు. అంటే  మనుషులకన్నా ఎక్కువ పొడవన్నమాట.
* పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధనలో దాని పళ్లు, వెన్నెముక, భుజం ఎముకలు దొరికాయి. వాటిని పూర్తిగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
* దీని శరీర నిర్మాణం 1929లో చైనాలో దొరికిన ఆ జాతి డైనో నిర్మాణానికి దగ్గరగా ఉందని గుర్తించారు.
* దాని రూపమే కాదు పేరు కూడా బారెడుంది. నోరు తిరగడమే కష్టం. Yongjinglong datangi అంటారు. దీనికి చైనాలో డ్రాగన్‌ అని అర్థం. ఇక ఈ జాతి సారోపాడ్‌ (sauropod). ఇప్పటి వరకు దొరికిన ఆ జాతి అవశేషాలను, వాటి శిలాజాలతో పరిశీలించి  శాస్త్రవేత్తలు వాటి  మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తున్నారు.
* ఆకారంలో భయంకరంగా ఉన్నా అవి  ఎలాంటి హానీ చేయం. పూర్తిగా శాకాహారులం. ఆకులు అలములు తింటూ బతికేవి .
* అవి బతికింది 100 మిలియన్‌ సంవత్సరాల క్రితం.అంటే దాదాపు పది కోట్ల ఏళ్లన్నమాట. అప్పుడు వాతావరణం ఇప్పుడున్నట్లు కాక భిన్నంగా ఉండేది.


  • ============================ 
Visit my website : Dr.Seshagirirao.com

Bumble bee,బంబుల్‌బీ

  •  


  •  
బంబుల్‌బీ  ఓ కీటకం... ఇప్పుడు దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలెట్టారు... ఎందుకో తెలుసా? విమానాల్ని తయారుచేయడానికి! ఇంతకీ దీని గొప్పతనమేంటీ?
 మనకు కనిపించే తేనెటీగల జాతికి చెందినదే. చిన్ని రెక్కలతో చూడ్డానికి ఏ ప్రత్యేకత లేకున్నా దీని అసలు బలమేంటో ఇన్నాళ్లకి తెలిసింది. ఈ కీటకం ఎంతో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని కూడా ఎగరగలదని తేలింది. ప్రపంచంలోనే ఎక్కువ ఎత్తున్న పర్వతం ఎవరెస్టు మీద వాతావరణ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉంటాయో తెలుసుగా. గాలి చాలా తక్కువగా ఉండి, జీవులకు ప్రాణవాయువు తీసుకోవడం కూడా కష్టతరమౌతుంది. అలాంటి ఎత్తయిన ప్రాంతాల్లో కూడా బంబుల్‌ బీ చక్కగా ఎగరగలదని తేలిందిప్పుడు.

* ఈ కీటకం భూమి నుంచి 30,000 అడుగుల ఎత్తులో కూడా ఎగురగలదట. కొన్ని పక్షులు మాత్రమే ఆ వాతావరణంలో, అంత ఎత్తులో ఎగరగలవని ఇప్పటి వరకు తెలుసు. హెలికాప్టర్లు కూడా అంత ఎత్తులో ప్రయాణించలేవు. అలాంటిది చిన్న కీటకమైన బంబుల్‌ బీకు అంత ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉండడం గొప్ప విషయమే కదా!

* అయినా దీని శక్తి గురించి ఎలా తెలిసింది. అంటే చైనాలో కొందరు పరిశోధకులు ఎత్తయిన పర్వత ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ కొన్ని బంబుల్‌ బీ కీటకాలు తిరగాడ్డం గమనించారు. అంత ఎత్తులో ఆ వాతావరణాన్ని తట్టుకుని ఎలా ఉండగలుగుతున్నాయో తెలుసుకోవడానికి ఓ ప్రయోగం చేశారు.

* ఓ గాజు గదిలో కొన్ని బంబుల్‌బీలను ఉంచారు. చేతి పంపు ద్వారా అందులోని గాలిని నెమ్మదిగా బయటికి లాగుతూ ఒత్తిడిని పెంచారు. పూర్తిగా భూమి నుంచి 9,000 మీటర్ల ఎత్తులో వాతావరణం ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులు కల్పించారు.

* ఆ ప్రతికూల వాతావరణ పరిస్థితిలోకూడా ఇవి రెక్కల్ని కొట్టుకుంటూ విస్తారంగా చాచడం ప్రారంభించాయి. తల, పొట్ట భాగాల వరకు చాచి గాలిని ఉత్పత్తి చేసుకున్నాయి. పరిస్థితుల్ని అనుగుణంగా మార్చున్నాయి. దీని ఆధారంగా ఇవి పైకి వెళుతున్న కొద్దీ ఆక్సిజన్‌ తగ్గుతున్నా ఎలా ఎగురుతున్నాయో తెలుసుకున్నారు.

* అయినా ఇవి ఎలా ఎగిరితే మనకేంటీ అంటారా? వీటిపై పరిశోధనలు జరిపి, వీటి రెక్కల నిర్మాణాన్ని గమనించి, చాలా ఎక్కువ ఎత్తులో ఎగరగలిగే విమానాల్ని తయారు చేస్తారట.

* బంబుల్‌బీలల్లో దాదాపు 250 జాతులున్నాయి.
* దీని పేరుకు అర్థం ఝుంకారం. ఇది చేసే శబ్దం వల్లే ఈ పేరొచ్చింది.
* ఇవి రెక్కల్ని ఫ్యాన్‌లా ఆడిస్తూ వాటి గూడును చల్లబరుచుకుంటాయి!


  • ============================
 Visit my website : Dr.Seshagirirao.com

Thursday, January 9, 2014

Torvosaurus gurney Dynosar,టార్వోసరస్ గర్నీ డైనోసార్‌





డైనోసార్‌ సంగతులు - ఈ మధ్యే  ఓ కొత్త డైనోగారు బయటపడ్డారు. మరి దాని ప్రత్యేకతేంటో తెలుసా? ఐరోపా ఖండంలోనే అతి పెద్ద మాంసాహార డైనో ఇదేనట. అంతేకాదు భూమ్మీద బతికిన అన్ని అతిపెద్ద మాంసాహార డైనో జాతులకన్నా ముందు బతికింది ఇదే.

* ఈ డైనోపేరు Torvosaurus gurney . పేరుకుదగ్గట్టే దీని రూపం కూడా చాలా పెద్దదే. ఇది 33 అడుగుల పొడవుండేదిట. అంటే స్కూలు బస్సుకన్నా చాలా ఎక్కువన్నమాట. ఈ భారీ డైనో బరువు 4 నుంచి 5 టన్నులు ఉండేది. అంటే దాదాపు రెండు ఏనుగుల బరువుతో సమానం. దీని దవడలు నాలుగడుగుల పొడవుండేవి. శరీరం కొలతలకు తగ్గట్టే దీని ప్రవర్తన కూడా భయంకరమే.

* ఈ డైనోకు 11 పళ్లు ఒక్కోటీ 4 అంగుళాలతో కత్తుల్లా ఉండేవి. వాటితో కనపడ్డ జంతువునల్లా ఇది కొరుక్కుతినేది. చివరికి ఇది శాకాహార డైనోసార్లను కూడా కరకరలాడించేదిట!

* ఇంతకీ దీని గురించి ఇన్ని సంగతులు ఎలా తెలిశాయి? అంటే ఈ డైనో శిలాజాలు ఈ మధ్య పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌ సమీపంలో దొరికాయి. వాటిని శాస్త్రవేత్తలు కంప్యూటర్లలో పరిశీలించి, ఈ డైనో రూపురేఖలు గీయగలిగారు.

* ఈ రాకాసి డైనో కన్నా పెద్ద శరీరంతో బతికిన మాంసాహార డైనోసార్లు ఉన్నాయి. కానీ 15 కోట్ల ఏళ్ల క్రితం ఇది బతికిన కాలంలో దీనంత పెద్ద మాంసాహార రాకాసి బల్లులేవీ లేవు. ఈ జాతి అంతరించిపోయాక కోట్ల ఏళ్ల తర్వాత అవి పుట్టుకొచ్చాయి.

* ఈ డైనోసార్‌ తిరగాడినప్పుడు ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదిట. ఎటుచూసినా పచ్చటి పరిసరాలు, నదులు, సెలయేళ్లతో ఎంతో అందంగా ఉండేది. ఈ డైనోతోపాటు అప్పుడు బోలెడు శాకాహార, ఎగిరే డైనోలు, ఇంకా మొసళ్లు, తాబేళ్లు, ఎలుకంత పరిమాణంగల రకరకాల క్షీరదాలు కూడా తిరగాడేవి.

  • ============================
 Visit my website : Dr.Seshagirirao.com _ 

Surfing Dogs ,సర్ఫింగ్‌ శునకాలు








సర్ఫింగ్‌ గురించి మీకు తెలుసుగా. కాళ్లకింద రబ్బర్‌ పాడ్‌లపై నిల్చుని సముద్రంలోని పెద్దపెద్ద అలల మీద జర్రున జారుతూ పడిపోకుండా విన్యాసాలు చేయడం. మనుషులకే కష్టమైన ఈ ఆటలో కుక్కలు ఆరితేరితే ఆశ్చర్యమే కదూ!

అమెరికాలోని శాండియాగో నగరంలో ప్రతి సంవత్సరం కుక్కలకు సర్ఫింగ్‌ పోటీలు జరుగుతాయి తెలుసా? ఈ మధ్యనే జరిగిన పోటీల్లోనైతే 65 కుక్కలు తోకలూపుతూ ఠీవీగా తమ యజమానులతోపాటు వచ్చి ఉత్సాహంగా సర్ఫింగ్‌ చేశాయి. సుమారు రెండువేల మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు కూడా.

ఇక ఈ సర్ఫింగ్‌ శునకాలు మామూలువి కావు. వీటి పేరిట ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్‌లు, వెబ్‌సైట్లు బోలెడు. అభిమానులు సందేశాలు పంపుతుంటే యజమానులు జవాబులు పంపుతూ ఉంటారు. పైగా ఇవి పోటీలో పాల్గొనాలంటే వాటి యజమానులు సుమారు 2వేల ప్రవేశ రుసుము కడతారు. ఇలా వచ్చిన డబ్బుని శాండియాగోలో పోలీసు కుక్కల విభాగానికి విరాళంగా ఇచ్చేస్తారు. ఇంత ఖర్చు పెట్టి కుక్కల్ని సముద్రంలో కష్టబెట్టకపోతే ఏమని అనుకోకండి. అవి గెలిస్తే ఎంత గుర్తింపో, మర్యాదో! విజేత కుక్కలతోపాటు వాటి యజమానులకు కూడా ఓ మంచి రిసార్ట్‌లో వారం రోజుల పాటు రాచ మర్యాదలు ఉంటాయి. పైగా బహుమతులు కూడా! అందుకే ఇంత హడావుడి. ఇక పెంపుడు కుక్కలకు సర్ఫింగ్‌లో తర్ఫీదునిచ్చే సంస్థలు బోలెడు.

శాండియాగోలో అయిదేళ్లుగా ఈ పోటీలు జరుగుతున్నాయి. పైగా వీటిలో బోలెడు విభాగాలు. కుక్కల వయసును బట్టి బృందాలు ఏర్పాటు చేస్తారు. కుక్కలన్నీ వరసగా నుంచుని ఒకేసారి సర్ఫింగ్‌ చేయాలి. ఎన్ని అలల మీద పడిపోకుండా నుంచుంది, భయపడిందా, ఆత్మవిశ్వాసం కనిపించిందా లాంటి అంశాలను బట్టి మార్కులుంటాయి. 


  • ============================

 Visit my website : Dr.Seshagirirao.com _